అమ్మకానికి ఫేస్ బుక్ అకౌంట్ల డేటా.. రూ.7కు ఒక అకౌంట్ సమాచారం..!

-

12 crores of facebook accounts hacked

ఫేస్ బుక్.. సోషల్ మీడియా రారాజు. దీనివల్ల ఎంత ఉపయోగం ఉందో.. అంతే నష్టం కూడా ఉంది. చాలా మంది నేటి యువత ఈ ఫేస్ బుక్ వలలో పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరే.. ఇప్పుడు ఫేస్ బుక్ చరిత్ర మనకెందుకు కానీ.. ఫేస్ బుక్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన సమాచారం బయటికి వచ్చింది. అదేంటంటే.. ఫేస్ బుక్ అకౌంట్లను ఆన్ లైన్ లో అమ్ముతున్నారట. అది కూడా 7 రూపాయలకు ఒక ఖాతా చొప్పున. షాకయ్యారా? అవును నిజమే.. సైబర్ నేరగాళ్లు 12 కోట్ల ఫేస్ బుక్ ఖాతాలను హ్యాక్ చేశారట. వాటిలో దాదాపు 81 వేల అకౌంట్ల సమాచారాన్ని ఆన్ లైన్ లో పెట్టారట. ఒక్కో ఖాతా డేటాను అమ్మకానికి కూడా పెట్టారు. రూ. 7 చెల్లిస్తే ఒక యూజర్ డేటాను అమ్మేస్తారట.

ఇటీవలే ఫేస్ బుక్ కేంబ్రిడ్జ్ అనాలిటికా కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. సరైన సెక్యూరిటీ లేక దాదాపు 5 కోట్ల ఫేస్ బుక్ యూజర్ల డేటా హ్యాక్ కు గురయింది. ఆ తర్వాత ఫేస్ బుక్ వివరణ ఇచ్చింది. సెక్యూరిటీని అప్ డేట్ చేసినట్టు చెప్పింది. యూజర్ల డేటాను రికవర్ చేసినట్టు ప్రకటించింది. కానీ.. మళ్లీ అటువంటి ఘటనే పునరావృతం అవడంతో ఫేస్ బుక్ యూజర్లు ఆందోళన చెందుతున్నారు. అమ్మకానికి పెట్టిన యూజర్లలో ఎక్కువగా బ్రెజిల్, యూఎస్, యూకే, ఉక్రెయిన్, రష్యాకు చెందిన వాళ్లు ఉన్నారట. ఈ విషయం తెలుసుకున్న ఫేస్ బుక్.. వెంటనే ఆన్ లైన్ లో ఉన్న యూజర్ల డేటాను తొలగించాలని ప్రభుత్వ సెక్యూరిటీ సిబ్బందిని కోరినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news