ప్రేమించిన వాడితోనే కలర్స్ స్వాతి పెళ్లి

-

కలర్స్ షోతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించిన స్వాతి హీరోయిన్ గా యువ హీరోలతో జతకట్టింది. తెలుగులోనే కాదు తమిళ సినిమాల్లో కూడా తన ముద్ర వేసేందుకు ప్రయత్నించిన స్వాతి కొన్నాళ్లుగా కెరియర్ లో వెనుకపడి ఉంది. ఈమధ్య అమ్మడి పెళ్లి వార్త వచ్చినా ఆమె రెస్పాన్స్ ఇవ్వలేదు. అయితే లేటెస్ట్ గా స్వాతి పెళ్లి వార్త అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది. మలేషియన్ పైలెట్ తో స్వాతి ప్రేమలో పడ్డదట. బెంగళూరుకి చెందిన వికాస్ తో కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడిపిస్తుందట అమ్మడు.

వారి ప్రేమకు పెద్దల అంగీకారం కూడా దొరకడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆగష్టు 30న రాత్రి 7:33గ.లకు వికాస్, స్వాతిలు ఒకటి కానున్నారు. టాలీవుడ్ లో ఒక యువ హీరోతో డేటింగ్ లో ఉన్నట్టుగా స్వాతి మీద అప్పట్లో రూమస్ర్స్ వచ్చాయి. వాటికి ఏమాత్రం స్పందించని స్వాతి ఫైనల్ గా పెళ్లి ముహుర్తంతో అందరికి షాక్ ఇచ్చింది.

పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగించే ఆలోచన లేదన్నట్టే తెలుస్తుంది. హీరోయిన్ గా చేసింది కనుక సపోర్టింగ్ రోల్స్ చేసే ఆలోచన ఉందో లేదో తెలియాల్సి ఉంది. తెలుగు హీరోయిన్ గా స్వాతి ప్రేక్షకుల మనసు గెలిచింది. పెళ్లి తర్వాత సినిమా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news