టాలీవుడ్‌ పై హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు..బాలీవుడే బెస్ట్ అంటూ !

 

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది తాప్సీ పన్ను. వైవిధ్యమైన సినిమాలతో దూసుకెళ్తోంది. తాజాగా తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ‘దొబారా’. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకుడు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది.

అయితే,తాజాగా టాలీవుడ్‌ పై హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను దేనిగురించైనా మంచి-చెడు చూస్తా. చెప్పాల్సిన విషయం ముఖం మీదనే చెప్పేస్తా.నేను ఇలా మాట్లాడటం కొందరికి నచ్చదు. అర్థం చేసుకోకుండా నాకు పొగరు అని కామెంట్‌ చేస్తారు. అయినా లెక్క చేయను. చివరగా టాలీవుడ్‌ తో పోలీస్తే, బాలీవుడ్‌ తనకు మంచి అవకాశాలు ఇచ్చిందని తాప్సీ స్ఫష్టం చేసింది. అయితే, తాప్సీ కామెంట్స్‌ కు నెటిజన్లు నెగిటివ్‌ గా కామెంట్స్‌ పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ సొట్ట బుగ్గల సుందరి చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.