అవయవదానంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. అయిన వారిని కోల్పోయామనే బాధలో ఉండి కూడా, మరొకరికి ప్రాణం పోయాలని ఆలోచించడం, అమలు చేయడం గొప్ప విషయం. మీ నిర్ణయం ఎందరికో స్ఫూర్తిదాయకం. బాధలో కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించిన మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నానన్నారు. రియల్ హీరోస్గా మారిన 162 కుటుంబాలను నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే సందర్బంగా ఈరోజు సన్మానించుకోవడం సంతోషంగా ఉందని వివరించారు.
ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాలు అనుసరిస్తున్నాయని.. ఆత్మీయులను కోల్పోయిన బాధలో ఉండి కూడా అవయవదానం చేయడం గొప్ప విషయం అన్నారు. మరో 8 మందికి మీరు ప్రాణం పోశారు. ప్రాణ బిక్ష పెట్టారు, సమాజానికి స్పూర్తి మీరు అవయవదానం చేయండి, ప్రాణాలు కాపాడాలని కోరుతున్నానని హరీష్రావు వెల్లడించారు.
అవయవదానం ప్రోత్సహించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. అవయవదానం కోసం అవసరం అయితే హెలికాప్టర్ సైతం వినియోగిస్తామన్నారు. సీఎం కే సి అర్ గారు ప్రారంబించిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల అనారోగ్య సమస్యలు తగ్గాయని.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్ల వ్యాధులు తగ్గుముఖం పట్టాయి, వైద్యం అందించడమే కాదు, రోగాలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు మంత్రి హరీష్రావు.