ప్రేక్షకులను మెప్పించే క్రమంలో హీరోలు రకరకాల పాత్రలు చేస్తున్నారు. యువ హీరోలే కాదు స్టార్ హీరోలు సైతం ఈ పంథా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈమధ్య హీరోల్లో మీడియా మీద మక్కువ ఎక్కువయిందని తెలుస్తుంది. అందుకే జర్నలిస్టు పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాకు మీడియాకు మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. సినిమా ఆడాలంటే మీడియా ప్రమోషన్స్ ఉండాల్సిందే.
అయితే కొన్ని సినిమాలు మీడియాలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ అందుకున్నా ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఆడేస్తాయి. అది పక్కన పెడితే ఒకేఒక్కడు నుండి రాబోతున్న అర్జున్ సురవరం సినిమా వరకు సినిమాలో హీరో జర్నలిస్టుగా నటిస్తూ వస్తున్నాడు. సమాజంలో జరిగే అన్యాయాలను వేలెత్తి చూపించేదే మీడియా.. ఇలా హీరోలు మీడియా జర్నలిస్టు పాత్రలు చేయడం వల్ల జర్నలిస్టుల బాధ్యతలను గుర్తు చేసినట్టు అవుతుంది.
మీడియా అంటే ట్రోల్స్ కు మాత్రమే కాదు సరైన టాస్క్ పడితే జర్నలిస్టులు వారి సత్తా చాటేలా సినిమాలు వస్తున్నాయి.
ఒకేఒక్కడు :
అర్జున్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఏకంగా సిఎంతో ఛాలెంజ్ చేసి ఒకరోజు సిఎంగా సంచలన నిర్ణయాలు తీసుకుని మీడియా పవర్ ఏంటో చూపించాడు.
కెమెరామెన్ గంగతో రాంబాబు :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా మీడియాపై జనాలకు ఉన్న ఓ రకమైన అసంతృప్తిని చూపెడుతూ.. జర్నలిస్ట్ తలచుకుంటే ఓ రాజకీయ నాయకుడి జీవితం ఎలా అవుతుందో చూపించాడు.
రంగం :
ఫోటో జర్నలిస్ట్ అయిన హీరో రాజకీయ నాయకుడు చేసే కార్యకలాపాలను బట్టబయలు చేసి అతన్ని ఏం చేశాడు అన్నది సినిమా కథ.
ఇజం :
మీడియా మీద ఇష్టంతో పూరి చేసిన మరో ప్రయత్నం ఇజం. అయితే ఇది ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. వికీ లీక్స్ లాగా ఈ సినిమాలో హీరో పెద్దవాళ్లకు సంబందించిన మొత్తం డేటాని ఎలా సాధిస్తాడు.. దానితో వాళ్ల పని ఎలా పడతాడు అన్నది సినిమా కథ. కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు.
ఇదం జగత్ :
సుమంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా జర్నలిస్టులు ప్రస్తుతం ఎలా ఉన్నారో సెటైరికల్ గా చెబుతూ ఫైనల్ గా వారు తలచుకుంటే ఏం చేస్తారో చూపించారు.
అర్జున్ సురవరం :
త్వరలో రిలీజ్ కాబోతున్నఅర్జున్ సురవరం సినిమాలో నిఖిల్ హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన కణితన్ రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో కూడా హీరో నిఖిల్ జర్నలిస్టుగా చేస్తున్నాడు.