మరో కరువు తీర్చిన ‘హిట్’, ఫుల్ జోష్ లో టాలీవుడ్…!

-

తెలుగులో సినిమాల పిచ్చి చాలా ఉంటుంది. ఏ సినిమా వచ్చినా సరే ప్రేక్షకులు థియేటర్ కి వెళ్తూ ఉంటారు. సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు ప్రేక్షకులు సినిమా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సంక్రాంతికి ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకుంది కేవలం ఒకే ఒక్క సినిమా. అవును ప్రేక్షకులు థియేటర్ కి ఎంతో ఆశగా సంక్రాంతి తర్వాత వెళ్తే ఒక్క మంచి సినిమా కూడా రాలేదు.

సంక్రాంతికి హిట్ అయిన అల వైకుంఠపురములో సినిమా మినహా ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. ఆ సినిమానే ఇప్పటి వరకు ఆడుతుంది. నితిన్ భీష్మ సినిమా ఒక్కటే ప్రేక్షకులను మెప్పించింది సంక్రాంతి తర్వాత. మన వాళ్లకు ప్రతీ వారం ఒక కొత్త సినిమా కావాలి. లేదా రెండు మూడు హిట్ సినిమాలు అయినా ఉండాలి. ఈ వారం రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒక్క సినిమా అయినా హిట్ అవుతుందని భావించారు.

ఈ వారం సినిమాల మీద టాలీవుడ్ కూడా భారీ ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలను “హిట్” సినిమా నెరవేర్చింది. నానీ నిర్మాతగా కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన “హిట్” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీనితో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది. సంక్రాంతి తర్వాత మరో మంచి సినిమా వచ్చి టాలీవుడ్ ని బతికించింది. ఇప్పట్లో మరో సినిమా లేదు. పెద్ద హీరోల సినిమాలు లేవు. నానీ నిర్మాత కాబట్టి ఈ సినిమా మీద ఎన్నో ఆశలు ఉన్నాయి.

భారీ అంచనాలతో వచ్చింది ఈ సినిమా. ఎలా అయితే మంచి హిట్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ కరువు తీర్చింది. సినిమా చూసిన వాళ్ళు అందరూ సినిమా సూపర్ హిట్ అంటున్నారు. మంచి జోష్ ఇచ్చింది ఈ సినిమా అంటున్నారు. ఇప్పటికే చిన్న సినిమాలు అంటే భయపడుతున్న బయ్యర్లకు కూడా ఈ సినిమా మంచి ఊపు ఇచ్చింది. ఇక టాలీవుడ్ అయితే చిన్న సినిమాల మీద ఆశలు పెట్టుకోవచ్చు అంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news