రామ్ చరణ్ పై హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ప్రశంసలు..!!

-

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ , రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. వీరిద్దరూ కూడా ఇప్పుడు ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ పై మరొకసారి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఎంతో సవాల్ తో కూడుకున్నది అని ఆయన పేర్కొన్నారు.. ఏకంగా హాలీవుడ్ దర్శక దిగ్గజం రామ్ చరణ్ ను ప్రశంసించడంతో మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ ను జేమ్స్ కామరూన్ పొగడడం ఆస్కార్ అవార్డు కంటే తక్కువ ఏమీ కాదు.. రామ్ చరణ్ ఈ స్థాయికి ఎదగడాన్ని ఒక తండ్రిగా గర్వంగా భావిస్తున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం జేమ్స్ కామెరూన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ని కూడా ఆయన తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకున్న ఈయన ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరొకవైపు రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

మొత్తానికైతే రామ్ చరణ్ పై హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ ఇలా ప్రశంసలు కురిపించడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news