హిట్ -2 సినిమా కోసం అడవి శేష్ పారితోషకం ఎంతంటే..?

నాచురల్ స్టార్ నాని నిర్మాణ సాధ్యంలో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా హిట్ 2, ఇదివరకే విశ్వక్ సేన్ తో హిట్ సినిమా తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఇప్పుడు యంగ్ హీరో అడవి శేష్ తో హిట్ 2 సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్ విడుదలవగా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా క్షణం, గూడచారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అడవి శేష్ తెరకెక్కించిన సినిమా మేజర్ .. పాన్ ఇండియా స్టార్ గా ఈ సినిమాతో మారిపోయారు.. ఈ సినిమా అన్నిచోట్ల మంచి కలెక్షన్స్ అందుకొని మంచి సక్సెస్ తగ్గడంతో మరింత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ముఖ్యంగా అడవి శేష్ మేజర్ సినిమా కోసం రూ. 4 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు హిట్ 2 సినిమా కోసం ఎంత తీసుకున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన రేంజ్కి తగ్గట్టుగానే ఈ సినిమాకు పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అడవి శేష్ తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనని కూడా తెలుస్తోంది. సినిమా కోసం ఏకంగా రూ. 6 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. నాని ఈ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే బాగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోని అడవి శేష్ కి కూడా భారీ స్థాయిలో పారితోషకం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి నాని విషయానికి వస్తే.. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకపక్క నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాడు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.