నితిన్ ట్వీట్ కు హృతిక్ స్పందించాడుగా……!!

-

తేజ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన జయం సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయిన యూత్ స్టార్ నితిన్, తొలి సినిమా తో మంచి హిట్ ని అందుకున్నాడు. ఆ తరువాత దిల్, సై సినిమాలతో కూడా సూపర్ హిట్స్ అందుకున్న నితిన్, అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగాడు. అయితే గత కొద్దిరోజులుగా మాత్రం ఆయనకు సరైన సక్సెస్ మాత్రం లభించడం లేదు. ప్రస్తుతం చలో సినిమా దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో భీష్మ అనే సినిమాలో నటిస్తున్న నితిన్, ఎలాగైనా ఆ సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సింగిల్ ఫరెవర్ అనే ట్యాగ్ ని పెట్టారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇకపోతే నిన్న ఈ సినిమా నుండి సింగిల్స్ యాంతం అనే సాంగ్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఇక ప్రస్తుతం అది మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. అయితే నిన్న నితిన్, రష్మిక ఇద్దరూ కూడా ఇటీవల హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన వార్ సినిమాలో హృతిక్, వాణి కపూర్ లపై తీసిన గుంగురో అనే సాంగ్ కి తమ స్టైల్లో డాన్స్ చేసారు. ఆ వీడియోని నితిన్ షేర్ చేస్తూ,

మీ అభిమానిగా ఏదో అలా ట్రై చేశాను, తప్పైతే సారీ అంటూ హృతిక్ రోషన్ ట్విట్టర్ ఐడిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు. కాగా కాసేపటి క్రితం ఆ వీడియోకు స్పందించిన హృతిక్, సో స్వీట్, చాలా బాగుంది మీ డ్యాన్స్, థాంక్యూ సో మచ్ నితిన్, రష్మీక, మీ ఇద్దరూ కలసి నటిస్తున్న భీష్మ సినిమాకు బెస్ట్ విషెస్ చెప్తున్నా అంటూ నితిన్ ట్వీట్ ని హృతిక్ రీట్వీట్ చేయడం జరిగింది. కాగా ప్రస్తుతం హృతిక్ చేసిన ఆ ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది……!! రష్మిక మందన్న, టాలీవుడ్,

Read more RELATED
Recommended to you

Latest news