ఓవర్సీస్ లో మహేష్ దమ్ము చూపిస్తాడా..!

-

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం అదిరిపోయే రేటు చెబుతున్నారట.

మహర్షి సినిమా ఓవర్సీస్ రైట్స్ 18 కోట్ల దాకా చెబుతున్నారట. అయితే అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం 12 నుండి 13 కోట్లు మాత్రమే పెట్టేలా ఉన్నారట. దర్శక నిర్మాతలు మాత్రం 18 కోట్లకు తగ్గేది లేదని చెబుతున్నారట. ఓవర్సీస్ లో మహేష్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మరి అనుకున్న విధంగా 18 కోట్ల డీల్ సెట్ చేసుకుంటారో లేదో చూడాలి. ఇప్పటివరకు మహేష్ మహర్షి సినిమా నుండి ఓ చిన్న టీజర్ మాత్రమే వచ్చింది. సినిమా సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news