నేనిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా.. హైపర్‌ ఆది వీడియో వైరల్

-

ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ నేమ్ బోర్డ్స్ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ట్రెండ్ నడుస్తోంది. నేనిప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం తాలుకా అంటూ సినీనటుడు హైపర్‌ ఆది చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీలో కూటమి విజయం సాధించడంతో మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్‌ నిర్వహించిన విజయోత్సవ వేడుకలో హైపర్ ఆది మాట్లాడారు. కూటమి అనే సినిమా 164 రోజులు ఆడిందని.. అందుకే ఈ సక్సెస్‌ మీట్‌ అని ఆది అన్నారు. లంకా దహనం తర్వాత హనుమంతుడు వెళ్లి శ్రీరాముడి పాదాలు పట్టుకున్నట్లు.. ఎన్నికల్లో విజయం తర్వాత చిరంజీవి దగ్గరకి పవన్‌ అలా వెళ్లారని.. అంతకంటే ఎమోషనల్‌ మూమెంట్‌ మరొకటి ఉండదని హైపర్ ఆది చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news