ఆ తప్పు వల్లనే రెండు నెలలు ఏడ్చాను.. హీరో విక్రమ్ సెన్షేషనల్ కామెంట్స్

-

తమిళ నటుడు చియాన్ విక్రమ్ గురించి దాదాపు అందరికీ తెలుసే ఉంటుంది. ఎందుకంటే ఆయన నటనకు చాలా మంది ఫిదా అవుతుంటారు. శివపుత్రుడు, అపరిచితుడు సినిమాలతో తెలుగులో విక్రమ్ కి అభిమానులు పెరిగిపోయారు. ఇటీవల విడుదలైన తంగలాన్ మూవీ సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి విజయం సాధించింది.

ఈ సినిమా విజయం సాధించడంతో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు విక్రమ్. తాజాగా తన లైఫ్ లో జరిగిన ఓ  సంఘటన గురించి వివరించాడు విక్రమ్. దర్శకుడు మణిరత్నం అంటే తనకు ఎంతో ఇష్టమని.. కెరీర్ ప్రారంభంలో ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కనేవాడినని తెలిపారు. అయితే బొంబాయి మూవీ ఆఫర్ తనకు వచ్చింది. తొలుత హీరోగా నన్నే ఎంచుకున్నారు. ఫైనల్ ఆడిషన్ కి పిలిచినప్పుడు చిన్న తప్పు జరిగింది. వీడియో కెమెరా కాకుండా.. స్టిల్ కెమెరా తీసుకొచ్చి సీన్ వివరించి యాక్ట్ చేయమన్నారు. మామూలు కెమెరా తీసుకొచ్చి.. యాక్ట్ చేయమంటారు. ఎందుకు నటించాలని ప్రశ్నించాను. పిక్చర్ బ్లర్ గా వస్తుందనుకొని తాను చేసిన తప్పు కారణంగా బొంబాయి సినిమా చేజారిపోయింది. దాదాపు రెండు నెలల పాటు బాధ పడ్డట్టు వెల్లడించారు చియాన్ విక్రమ్.

Read more RELATED
Recommended to you

Latest news