Kangana Ranaut: ఆ విష‌యం త‌ప్పు అని నిరూపిస్తే.. పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంట్రావ‌ర్సీటీ క్వీన్ డేరింగ్ కామెంట్స్!

-

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ అంటే.. ట‌క్కున గుర్తుకు వ‌చ్చే పేరు కంగనా రనౌత్. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ బ్యూటీ. ఏ విష‌యానైనా ముక్కు సూటిగా కుండ బద్ద‌లుకొట్టిన‌ట్టు మాట్లాడుతోంది. త‌న మాట‌ల‌కు వ్యతిరేకతలు వెల్లువెత్తినా త‌గ్గేదేలే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. త‌న‌ను కామెంట్ చేసిన‌వారిపై కూడా గట్టి కౌంట‌ర్ వేస్తూనే ఉంటుంది.

తాజాగా భారతదేశానికి స్వతంత్రం బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్ష అని సంచలన కామెంట్ చేసింది. 1947 వ‌చ్చిన‌ది నిజ‌మైనా స్వాతంత్రం కాద‌నీ, దేశానికి నిజమైన స్వాతంత్రం మోడీ ప్ర‌ధాని అయినా త‌ర‌వాత‌ 2014లోనే వ‌చ్చిందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆ వ్యాఖ్య‌లు స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర వీరులను అవ‌మ‌నించేలా ఉన్నాయ‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్ల‌వెత్తాయి. ఈ క్ర‌మంలో ఆమెకు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపేత‌ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.

వారి విమ‌ర్శ‌ల‌పై కంగనా స్పందించింది. తాను చేసిన వ్యాఖ్య‌లు అవాస్త‌వ‌మ‌ని నిరూపిస్తే.. త‌న ప‌ద్మ శ్రీ అవార్డును వెన‌క్కి ఇస్తాన‌ని స‌వాల్ విసిరింది. 1857 ఫైట్ గురించి నాకు తెలుసు కానీ 1947లో ఎలాంటి యుద్ధం జరిగిందో నాకు తెలియదు. ఈ విషయంలో ఎవరైనా తనకు అవగాహన కల్పిస్తే.. పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేసి.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నానంటూ కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news