2020 రీమేక్‌ నామ సంవత్సం…స్టార్లందరూ రీమేక్‌లే

-

సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలో ఒక భాషలో తెరకెక్కి సూపర్ హిట్టయిన సినిమాని ఇంకో భాషలోకి రీమేక్ చేయడం ఇప్పుడు కొత్తగా వస్తున్నదేమీ కాదు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ కాలం నుండి ఉన్నదే. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పటికి ఇప్పటికి మాత్రం ఒక విషయంలో తేడా ఉంది. అదే రచయితల కొరత. ఇది ఇండస్ట్రీలో నిజంగా ఉందా లేక కావాలనే మేకర్స్ చెబుతున్నారా అన్నది చాలామందికి మిలియన్ డాలర్స్ ప్రశ్నే. అయితే ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో భాషలో తీయాలన్నా కూడా పెద్ద రిస్కే. అందుకు కారణం నెట్ ఫ్లిక్స్, అమోజాన్ లలో నెల తిరగకుండానే ఆ సినిమా వచ్చేస్తుంది.

 

అయినా మేకర్స్ ఏ ధైర్యం తో సినిమాని రీమేక్ చేస్తున్నారో అర్థం కావండ లేదు. ఇక మన టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని సినిమాలు తమిళం, హిందీ, మళయాళం మాత్రమే కాదు కొరియన్ లాంగ్వేజ్ నుండి రీమేక్ చేస్తున్నారు. అలా 2020 లో కొన్ని చిత్రాలు రీమేక్ అవుతున్నాయి. ఇందుకు రచయితల కొరత కారణమా అంటే ఎక్కువమటుకు అవుననే సమాధానం వస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించగా మంచి సక్సస్ ని సాధించింది. అంతేకాదు ఇదే సినిమాని కోలీవుడ్ లో అజిత్ తో రీమేక్ చేశారు. అక్కడా విజయం సాధించింది. దాంతో రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాని రీమేక్ చేస్తున్నారు.

ఇక అలాగే మరో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కోలీవుడ్ లో ధనుష్ నటించిన ఈ కల్ట్ మూవీ 100 కోట్ల వసూళ్ళని సాధించింది. 2019 లో భారీ హిట్ గాను నిలిచింది. దాంతో ఈ సినిమాని నిర్మాత సురేష్ బాబు రైట్స్ కొన్నారు. కొన్నప్పుడు అందరు కాస్త అనుమానం వ్యక్తం చేశారు ఇది ఎలా వర్కూట్ అవుతుంది అని. కాని ఎప్పుడైతే నారప్ప అంటూ వెంకటేష్ ని టైటిల్ లుక్ లో రివీల్ చేశారో అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. వెంకీ మేకోవర్ తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

ఇలానే మరికొన్ని సినిమాలు ఈ సంవత్సరం టాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ అందుకున్న రాం పోతినేని తో కిషోర్ తిరుమల రెడ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి మూలం తమిళ హిట్ సినిమా తడం. అలాగే సుమంత్ హీరోగా ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తున్న కపటదారి సినిమాకి కన్నడ సినిమా కవలుదారి ఆధారం. ఇక యంగ్ హీరో నితిన్ కూడా బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ ని తెలుగులో సొంత బ్యానర్ లో రీమేక్ చేస్తున్నాడు. వీటితో పాటు లూసిఫర్, అయ్యప్పనుం కోషియుం సినిమాలు తెలుగులో రీమేక్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version