“పుష్ప” సినిమాలో రష్మిక మందన్న తప్ప మరో హీరోయిన్ లేనేలేదు ..!

-

అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత స్టైలిష్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత వస్తున్న పుష్ప సినిమా మీద ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. ఇక సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్టపడుతున్నారు.

 

Rashmika Mandanna Is Busy Learning Chittoor Accent For Allu Arjun ...

ఇక మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాని గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో నిర్మిస్తున్నారు. దాదాపు 60 శాతం సినిమా షూటింగ్ ఫారెస్ట్ లోనే నిర్వహించనున్నారు. మరోసారి రంగస్థలం లాంటి కల్ట్ కంటెంట్ తో సుకుమార్ ఈ సినిమాని తీర్చి దిద్దాలని ప్లాన్ చేసుకున్నాడు. అంతేకాదు రంగస్థలం సినిమాతో రాం చరణ్ సమంత లకి ఎలాంటి క్రేజ్ వచ్చిందో అంతటి క్రేజ్ అల్లు అర్జున్, రష్మిక మందన్న లకి తీసుకు వచ్చేందుకు ఆయా పాత్రలని తీర్చి దిద్దాడట.

అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని ఆమే అల్లు అర్జున్ కి లవర్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. వాళ్ళలో ఒక హీరోయిన్ గా నివేదా థామస్ అని, పూజా హెగ్డే …ఇలా రక రకాల పేర్లు తెరమీదకొచ్చాయి. కాని తాజా ఈ విషయం లో క్లారిటి ఇచ్చారట మేకర్స్. ఇందులో ఒక్క రష్మిక మందన్న తప్ప మరో హీరోయిన్ కి స్థానం లేదని తాజాగా అందిన సమాచారం. ఇక ఈ సినిమాని లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news