త‌గ్గ‌ని అనుష్క క్రేజ్.. పెరుగుత‌న్న ఫాలోయింగ్

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క సినిమాలు ఎక్కువ చేయ‌కున్న రోజు రోజు కు ఫాలోయింగ్ పెరుగుతూ ఉంది. మ‌న దేశంలో ఇటీవ‌ల కూ అనే యాప్ వ‌చ్చింది. ఈ యాప్ లో వ‌రుస‌గా సెల‌బ్రెటీలు అకౌంట్ ల‌ను తెరు స్తున్నారు. అదే విధంగా హీరోయిన్ అనుష్క కూడా నాలుగు నెల‌ల క్రితం కూ యాప్ లో అకౌంట్ ఓపెన్ చేసింది. అయితే కేవ‌లం నాలుగు నెల స‌మ‌యంలో నే రికార్డు స్థాయిలో ఫాలోయ‌ర్స్ ను అనుష్క సొంతం చేసుకుంది.

ఈ నాలుగు నెల‌ల కాలం లో ఏకంగా 10 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. అతి త‌క్కువ కాలంలో ఇంత మంది ఫాలోవ‌ర్స్ ను సొంతం చేసుకున్న అనుష్క ను చూసి ఆమె కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని అంటున్నారు. అయితే తెలుగు ప్రేక్ష‌కుల‌లో హీరోయిన్ అనుష్క కు ఫాలోయింగ్ ఎక్కువ గానే ఉంటుంది. అనుష్క చేసే లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆలోచింప చేసే విధంగా ఉంటుంది. అలాగే అరుంధ‌తి సినిమా నుంచి అనుష్క కు మంచి ఫాలోయింగ్ వ‌చ్చింది. రాణి రుద్రుమ దేవీ, బ‌హుబ‌లి వంటి సినిమా ల తో అనుష్క క్రేజ్ అమంతం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news