RRRకు నిరాశ… ‘ఆస్కార్’కు ఎంపికైన గుజరాతీ చిత్రం ఇదే!

-

క్రేజీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్‌లోనూ నిలుస్తుందని చాలామంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి తెగు చర్చించుకున్నారు. దీంతో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్​ రేసులో నిలుస్తుందని ఆశించారు. కానీ ఈ విషయంలో ఆర్​ఆర్​ఆర్​కు నిరాశ ఎదురైంది. తాజాగా ప్రకటించిన భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ ఎంపికైంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

95వ ఆస్కార్ అవార్డుల పోటీలకు ఛెల్లో షోను ఎంపిక చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ సుప్రాన్ సేన్ వెల్లడించారు. ఇంగ్లిష్​లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా పిలుస్తున్న ఈ చిత్రానికి పాన్ నలిన్ దర్శకత్వం వహించాడు. 2021 అక్టోబర్ 14వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలైంది. రాయ్ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్​పై సిద్ధార్థ్ రాయ్ కపూర్ నిర్మించారు. జుగాడ్ మోషన్ పిక్చర్స్, మాన్​సూన్ ఫిల్మ్స్, ఛెల్లో షో ఎల్ఎల్​పీ, మార్క్ దువాలే సైతం నిర్మాణంలో భాగమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news