వైసీపీకి 30-40 సీట్లే వస్తాయ్: ఎంపీ రఘురామ

-

సీఐడీ అధికారులు హైకోర్టు తీర్పును ఉల్లంఘించారని, సీఐడీ విచారణకు తాను రాలేదని డీఐజీ సునీల్ కుమార్ స్టేట్‌మెంట్ ఇచ్చారని, ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టులో తన తరఫు న్యాయవాది స్పష్టంగా చెప్పారని, తనను కట్టేసి కొట్టారని….వర్చువల్‌గా విచారణ జరపాలని కోర్టు గతంలో చెప్పిందన్నారు రఘురామ కృష్ణంరాజు. కోర్టులో తాను వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉందన్నారు రఘురామ కృష్ణంరాజు. ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ కట్టుకధలు చెప్తున్నారని, ఆరు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇప్పుడు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని రఘురామ అన్నారు. సర్వేలన్నీ వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, 30, 40 సీట్లు మాత్రమే వచ్చేలా ఉన్నాయన్నారు. సభలో విపక్షాలు ఆందోళన చేస్తే గెంటేయడానికి మంచి స్పీకర్ ఉన్నారని, సీఎం జగన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అని కొందరిని అడిగానని.. పిట్టలదొర (ముఖ్యమంత్రి) మాటలు ఎవరు నమ్ముతారని అంటున్నారనన్నారు రఘురామ కృష్ణంరాజు.

YSRCP MP Raghu Ramakrishna Raju arrested by CID | NewsTrack English 1

పోలీసులు, టీచర్ల నియామకాలు లేవని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదని ఆరోపించారు రఘురామ కృష్ణంరాజు. కీయా పరిశ్రమ, అపోలో టైర్స్ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినవేనన్నారు రఘురామ కృష్ణంరాజు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పరిశ్రమలు తరలిపోయాయని ఎద్దేవా చేశారు. 2019లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడున్నర ఏళ్ల నుంచి ఫైనాన్స్ కమిషన్ లేదని రఘురామ విమర్శించారు. రాజధానిపై సీఎం జగన్ గతంలో చిలకపలుకులు పలికారని, రాజధానిలో ఇల్లు కట్టుకున్నాని అన్నారని, హైదరాబాద్‌ను మించిన రాజధాని నిర్మిస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news