రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్న జిల్లా ములుగు : సత్యవతి రాథోడ్

-

ములుగు జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం పోడు వ్యవసాయ భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో అటవీ సంపదను సంరక్షించాలని, అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పోడు రైతు అర్హులకు పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వర చర్యలు తీసుకోవాలని గిరిజన సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ అడవులు ఉన్న జిల్లా ములుగు అని తాడ్వాయి మండలం లింగాల, బందాల గ్రామాలలో పోడు భూముల సమస్య ఎక్కువ ఉన్నాయన్నారు సత్యవతి రాథోడ్.

Mahabubabad: Minister Satyavathi Rathod assures to help the man whose money  was shredded by rats

పోడు భూముల పట్టాల సమస్య పరిష్కారనికి క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ననుసరించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసిందని, ప్రభుత్వ మార్గదర్శకాల కనుగుణంగా సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను సత్యవతి రాథోడ్ ఆదేశించారు. అరుహులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలు అందించి, హక్కు కల్పించేందుకు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి అన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జెడ్పీ వైస్ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, డీఎఫ్ఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news