రౌడీ స్టార్ విజ‌య్ మేనియా ఇది.. ఇంత‌మంది ఫాలోవ‌ర్స్ ఎవ‌రికీ లేరు!

-

బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇంస్ట్రీలో అవ‌కాశాలు రావ‌డ‌మే గొప్ప‌. మ‌రి వ‌చ్చిన అవ‌కాశాల‌తో చాల త‌క్కువ టైమ్‌లో స్టార్ హీరోగా ఎద‌గ‌డ‌మా? అస‌లు ఛాన్సే లేదు. అంటారా ఉంద‌ని నిరూపించాడు మ‌న రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరోకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ మ‌రెవ‌రికీ లేద‌నే చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్‌లో టాప్‌లో కొన‌సాగుతున్నాడు.

ఈ హీరోకి యూత్ ఐకాన్‌గా మంచి పేరుంది. త‌న‌దైన న‌ట‌న‌, మేన‌రిజంతో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అందుకే ఇండ‌స్ట్రీలో విజ‌య్ పేరు మార్మోగిపోతోంది. ఇప్పుడు ఆయ‌న పేరున ఓ అరుదైన రికార్డు న‌మోదైంది.

సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా ఆక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్‌, మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌కు కూడా లేని ఫాలోయింగ్ ఇప్పుడు విజ‌య్ సొంతం అయింది. సౌత్ ఇండియా హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కాని ఫాలోయింగ్‌ను ఇన్ స్టా గ్రామ్‌లో సంపాదించారు. 12మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఇప్పుడు విజ‌య్ కు ఉన్నారు. ఇంత‌మంది పాలోవ‌ర్స్ మ‌న సౌత్‌లో ఎవ‌రికీ లేరు. ఎంతైనా విజ‌య్ సూప‌ర్ క‌దా.

Read more RELATED
Recommended to you

Latest news