ప‌ది రోజులు @ 5 కోట్లు.. అలియాభట్ య‌మా కాస్టిలీ గురూ..!!

-

బాలీవుడ్ బ్యూటి అలియాభట్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎప్పుడైతే ద‌‌ర్శ‌క‌ధీరుడు `ఆర్ఆర్ఆర్‌` సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందో.. అప్ప‌టి నుంచీ ఈమెకు తెలుగు ప్రేక్ష‌కులు సైతం బాగా గుర్తుపెట్టేసుకున్నారు. పీరియాడిక్‌ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా అలియాభట్ న‌టించ‌గా.. ఎన్టీఆర్‌కు జోడీగా ఒలివియా మోరిస్ నటిస్తున్నారు.

Alia Bhatt reminds public to save water while maintaining good ...

అయితే ఈ వారం రోజుల్లో అలియా భ‌ట్‌ సెట్స్ పైకి రావాల్సి ఉంది. కరోనా కారణంగా షూటింగ్ ను నిలిపివేయడంతో అలియా రాక సాధ్యం కాలేదు. షూటింగ్ విషయంలో రాజమౌళి ప్రత్యామ్నాయం కోసం కూడా చూశాడు కానీ కుదరలేదు. అయితే లాక్‌డౌన్ పూర్తి అయ్యాక ఈమె షూటింగ్ పాల్గోనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం ఆమె అందుకోనున్న రెమ్యున‌రేష‌న్ ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్ ను కేటాయించిందట.

ఈ ప‌ది రోజులకిగాను రెమ్యున‌రేష‌న్‌గా ఆమె 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్న మాట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఆమె ఈ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు. తెలుగు సినిమాకిగాను ఈ స్థాయి పారితోషికాన్ని అందుకున్న కథానాయిక అలియానే అని అంటున్నారు. ఏదేమైనా అలియాభట్ య‌మా కాస్టిలీ అంటున్నారు కొంద‌రు.

Read more RELATED
Recommended to you

Latest news