లీకురాయుళ్లు తో ఇబ్బంది పడుతున్న SSMB28.!

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే చుర కత్తుల లాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి తెలుస్తోంది.ఇందులో యంగ్ సంచలన అందం పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం మరో సారి చికాకులు వస్తున్నట్లు తెలుస్తోంది.అదేమిటంటే యూనిట్ వర్గాల లోనే కొంత మంది లీకు రాయుళ్లు పోగైయ్యారట.

ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి ఇప్పటికే ఒక ఫొటో ను లీకు వీరులు లీక్ కాగా నేడు మరొక రెండు పిక్స్ లీక్ అయ్యాయి. కాగా అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో మూవీ టీమ్ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కోట్లు ఖర్చు చేసి తీస్తున్న సినిమాలకి సంబంధించి పలువురు ఈ విధంగా పిక్స్, వీడియోస్ ని సోషల్ మీడియాలో లీక్ చేయడం సరైనది కాదని త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు ఇద్దరు యూనిట్ లోని అందరిని పిలచి క్లాస్ పీకి నట్లు తెలుస్తోంది. అసలే లేట్ అంటే మధ్యలో ఇదేమి గోల అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.