మారుతి బన్ని ఉందా.. లేదా..?

-

ఈరోజుల్లో నుండి శైలజా రెడ్డి అల్లుడు వరకు తన సత్తా చాటుతూ వస్తున్న దర్శకుడు మారుతి తన తర్వాత సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేస్తాడని అంటున్నారు. బన్నితో క్లోజ్ రిలేషన్ ఉన్నా మారుతి ఇంతవరకు అతనితో సినిమా చేయలేదు. అయితే మీడియం బడ్జెట్ సినిమాల వరకు ఓకే కాని కమర్షియల్ సినిమా హ్యాండిల్ చేసే సత్తా మారుతికి లేదని టాక్. ఎందుకు అంటే అలా వచ్చిన బాబు బంగారం, శైలజా రెడ్డి అల్లుడు రెండు నిరాశ పరచాయి.

ఇక నా పేరు సూర్య తర్వాత తాను ఏ సినిమా చేయాలో అని పెద్ద కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు అల్లు అర్జున్. విక్రం కుమార్ సినిమా రెడీ టూ స్టార్ట్ అన్నంత ఊపు చేసి నిరూగార్చారు. ఇక త్రివిక్రం తో సినిమా ఉంటుందని వార్తలొచ్చిన అరవింద సమేత సక్సెస్ లో ఉన్న త్రివిక్రం ఎలా లేదన్నా 6 నెలలు గ్యాప్ తీసుకుంటాడని తెలుస్తుంది.

అందుకే మారుతి బన్నితో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఆల్రెడీ కథ కూడా చెప్పడం జరిగిందట. ఫస్ట్ హాఫ్ వరకు సూపర్బ్ అనేసినా సెకండ్ హాఫ్ మళ్లీ మార్చమని చెప్పాడట. ఫ్యామిలీ ట్రిప్ ముగించి వచ్చాక సెకండ్ హాఫ్ వింటానని చెప్పాడట. సో బన్ని నెక్స్ట్ మారుతి డైరక్షన్ లో ఉండే ఛాన్స్ కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version