కౌశల్ బండారం బయటపడింది

-

బిగ్ బాస్ సెకండ్ సీజన్ విన్నర్ గా కౌశల్ మండా కౌశల్ ఆర్మీ అంటూ తనకో అభిమాన సైన్యం ఏర్పరచుకున్నాడు. హౌజ్ లో ఒంటరిపోరాటం చేసి అందరి మనసులు గెలిచిన కౌశల్ బిగ్ బాస్ షో ముగిశాక కూడా తన గేం ఆడుతున్నాడు. ఇప్పటికే కంటెస్టంట్స్ అందరి మీద విమర్శలు చేస్తున్న కౌశల్ తన కామెంట్స్ తో ఆశ్చర్యపరిచాడు.

బిగ్ బాస్ విన్నర్ అయినందుకు (పి.ఎం.ఓ) ప్రధాన మంత్రి ఆఫీస్ నుండి తనకు కాల్ వచ్చిందని చెప్పిన కౌశల్.. తనకు సపోర్ట్ గా అత్యధిక ఓట్లు వచ్చినందుకు గిన్నీస్ బుక్ వాళ్లు కూడా రికార్డ్ కూడా ఏర్పడిందని అన్నాడు. ఈ కామెంట్స్ విన్న కొందరు ఫ్యాన్స్ అవునా అని ఆశ్చర్యపోయి సరిపెట్టుకోగా కొందరు యాంటీ ఫ్యాన్స్ మాత్రం అసలీ కౌశల్ వ్యవహారం ఏంటని తేల్చుకునేందుకు ఏకంగా ఆర్టిఐ ద్వారా వివరాలు సేకరించారు.

సెప్టెంబర్ చివరి వారంలో ముగిసిన బిగ్ బాస్ 2 ఫైనల్ విన్నర్ కౌశల్ గెలవగా.. దానికి సంబందించి పిఎం ఆఫీస్ నుండి ప్రశంసలు అందాయా అన్నది కనుక్కున్నాడు ఒక వ్యక్తి. అలాంటిదేమి లేదని తేలిందట. అంతేకాదు గిన్నీస్ రికార్డ్ నెలకొల్పాలంటే ముందు ఎవరైతే రికార్డ్ సృష్టిస్తారో వారే గిన్నీస్ బుక్ నిర్వాహకులకు ఇంటిమేట్ చేసి వారి ముందు రికార్డ్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఇదేమి లేకుండా నోటి వచ్చినట్టు మాట్లాడుతూ జనాల్లో తానేదో గొప్ప విజయం సాధించానని చెప్పుకుంటున్న కౌశల్ నిజ స్వరూపం ఇది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి లేని పోని డాబులు పోయి వచ్చిన కాసింత ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంటున్నాడు కౌశల్. ఈ విమర్శల మీద కౌశల్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news