చిల్డ్రన్స్ డే స్పెషల్ గూగుల్ డూడుల్ విశిష్టత ఏంటో తెలుసా?

-

children's day special google doodle
ఇవాళ చిల్డ్రన్స్ డే తెలుసు కదా. మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పుట్టింది నవంబర్ 14నే. అయనకు నివాళిగా దేశమంతా ప్రతి ఏటా నవంబర్ 14ను పిల్లల దినోత్సవంగా జరుపుకుంటారు. ఆయన పుట్టింది నవంబర్ 14, 1889న.

ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఓ విద్యార్థిని గూగుల్ డూడుల్ ను తయారు చేసింది. ఆ విద్యార్థిని తయారు చేసిన గూగుల్ డూడుల్ నే గూగుల్ ఇవాళ తన హోమ్ పేజీలో ఏర్పాటు చేసింది. మీరు పైన చూస్తున్నారుగా ఫోటో అదే. www.google.co.in అని బ్రౌజర్ లో టైప్ చేస్తే మీకు కూడా ఇవాళ అదే కనిపిస్తుంది. అయితే.. ఆ డూడుల్ కు ఓ విశిష్టత ఉంది. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ఎన్నో అంశాలు ఉన్నాయి.

ముంబైకి చెందిన పింగ్లా రాహుల్ అనే విద్యార్థిని ఈ డూడుల్ ను తయారు చేసింది. ఆమె తయారు చేసిన ఈ డూడుల్ 2018 డూడుల్ ఫర్ గూగుల్ కాంపిటీషన్ ను గెలుచుకుంది. అందుకే ఇవాళ ఆమె డూడుల్ ను గూగుల్ హోమ్ పేజీలో సెట్ చేశారు. ఆ డూడుల్ ను పరీక్షించి చూస్తే అంతరిక్షాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. టెలిస్కోప్ సాయంతో ఓ అమ్మాయి ఆకాశాన్ని చూస్తుంటుంది. ఆ డూడుల్ లోనే అంతరిక్షంలో ఉండే గెలాక్సీలు, ప్లానెట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ అన్నింటినీ గూగుల్ అక్షరాలతో లింక్ చేసి చూపించింది ఆ విద్యార్థిని. స్పేస్ ను కళ్లకు కట్టినట్టు చూపించిన ఆ విద్యార్థిని డూడుల్ అందుకే కాంపిటిషన్ లోనూ విన్నయింది.

Read more RELATED
Recommended to you

Latest news