కోన వెంకట్ రాజమౌళి ని మించి పోతున్నాడా ..?

-

ఇప్పటి వరకు టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాని తీసింది ఒక్క రాజమౌళి మాత్రమే. బాహుబలి ఫ్రాంఛైజీతో టాలీవుడ్ రేంజ్ మొత్తం అలాగే తెలుగు సినిమాల స్థాయి పూర్తిగా మారిపోయింది. అయితే అది దర్శకుడిగా రాజమౌళి ఘనత అని చెప్పాలి. అప్పటి నుంచి తెలుగులో భారీ బడ్జెట్ తో తెరకెక్కించే చాలా సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగానే తయారవుతున్నాయి. సాహో, సైరా పాన్ ఇండియా కేటగిరిలో వచ్చిన సినిమాలే.

 

ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోనే ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. టాలీవుడ్ యంగ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. అలాగే అల్లు సుకుమార్ ల పుష్ప, పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ ల ఫైటర్, కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవిల ఆచార్య, ప్రభాస్ సినిమా ..ఇలా చాలా సినిమాలు పాన్ ఇండియా సినిమాలు గా నిర్మితమవుతున్నాయి.

ఇక సౌత్ లో గత నాలుగైదు ఏళ్ళలో బయోపిక్స్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. జీవిత కథ లతో కమర్షియల్ సినిమాలను రూపొందించి భారీ సక్సస్ లను అందుకుంటున్నారు మేకర్స్..హీరోస్. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కథా రచయిత నిర్మాత కోన వెంకట్ 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్క‌రించ‌నున్నారు.

కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై కోన‌వెంక‌ట్ ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌ భారీ పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. సంజ‌నా రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వరలో ప్ర‌క‌టించనున్నారు. ఇక ఇప్పటికే కోన వెంకట్ అనుష్క మాధవన్ తో నిశబ్ధం అనే సినిమాను నిర్మించారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. వరసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న కోన వెంకట్ త్వరలో దర్శకుడిగాను మారబోతున్నారు. అయితే ఇండస్ట్రీలో రాజమౌళి కి కోన వెంకట్ పోటీ రాబోతున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news