నివేదా థామస్ లో ఆ సత్తా లేదా అయితే పవన్ కళ్యాణ్ కి కష్టమేనా ..?

-

నివేదా థామస్ తెలుగులో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. నటన పరంగా నివేదా థామస్ అంటే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ ఏర్పడింది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన జెంటిల్‌మాన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా చూసిన అందరు నివే థామస్ పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు.

 

After Darbar, Nivetha Thomas gets this remake! - Tamil News ...

కాని ఎందుకనో అప్పుడుకొటి అప్పుడొకటి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత నిన్ను కోరి, ఎన్.టి.ఆర్ తో జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా ..సినిమాలు మాత్రమే చేసింది. వీటిలో పెద్ద సినిమా అంటే ఎన్.టి.ఆర్ సినిమా ఒక్కటే. మిగతావన్ని మీడియం బడ్జెట్ సినిమాలు. రాకెట్ లా దూసుకుపోతుందనుకున్న నివేదా అందుకు రివర్స్ గా వెళుతుంది. అయితే ఇక్కడ ఒక కారణం మాత్రం ఉంది. అదే తను ఎక్స్‌ఫోజింగ్ కి ఒప్పుకోకపోవడం. గ్లామర్ ఇండస్ట్రీ అయినప్పటికి తను మాత్రం హద్దు మీరి క్యారెక్టర్స్ చేయడం లేదు.

 

Nivetha Thomas As Female Lead in Pawan Kalyan's Upcoming Movie ...

ఇదే నివేదా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవకపోవడానికి ముఖ్య కారణం అని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం నివేదా థామస్ పవర్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తుంది. కాని హీరోయిన్ గా మాత్రం కాదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత మళ్ళీ అంత ఇంపార్టెంట్ రోల్ అంటే నివేదా దే. ఇదే పాత్రని బాలీవుడ్ లో తాప్సీ పోషించింది. అక్కడ తాప్సీ క్యారెక్టర్ చుట్టూనే ఎక్కువగా కథ తిరుగుతుంది. ఈ సినిమా తాప్సీకి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది.

అయితే ఆ పాత్రని సమర్ధవంతంగా నివేదా చేయగలిగే సత్తా ఉందా అని మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఈ మద్యలో నివేదా థామస్ సినిమా కూడా రాలేదు. ఒకవేళ నివేదా థామస్ గనక ప్రేక్షకులను మెప్పించలేకపోతే ఆ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ మీద పడే అవకాశమూ ఉంది అంటున్నారు. అది ఒక మైనస్. అందులో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరో గా ఇక్కడ కథ నడుస్తుంది. మరి ఈ సినిమా తాప్సీ లా నివేదా కి ఎలాంటి పేరు తీసుకు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news