ప్రస్తుతం గడిచిన రెండు రోజుల నుంచి ఎక్కువగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ అందరికీ చురుకలు లంటిస్తున్నారు. ఇక అంతే కాకుండా తన లెక్కలన్నీ చెబుతూ ఇంకొకసారి తనని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదని తెలియజేస్తూ ఉన్నారు. గడిచిన 8 నెలలుగా తాను ఆరు చిత్రాలు చేశానని దాదాపుగా రూ.100 నుంచి రూ. 120 కోట్ల రూపాయలు సంపాదించానని తెలియజేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ పైన వార్తలు కూడా చాలా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
పవన్ కళ్యాణ్ ఈ డబ్బులను తన బిడ్డల కోసం దాచిన ఎఫ్ డి డబ్బుతోనే పార్టీ ఆఫీస్ కట్టానని తెలియజేశారు. ఇక ఇప్పటివరకు 33 కోట్ల రూపాయలు టాక్స్ కట్టానని తెలియజేశారు. జిఎస్టి కాకుండా కట్టానని తెలిపారు. అంతేకాకుండా హుధూద్ సైనికుల కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని సీఎం ఫండ్ కు ఇలా దాదాపుగా రూ.12 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చానని తెలిపారు. రైతు భరోసా కోసం అందరూ ఇచ్చిన నిధులు రూ.3 కోట్ల రూపాయలని, తన బర్తడే రోజును అందరూ కలిసి విరాళాలు రూ.4 కోట్ల రూపాయలని లెక్కల చీటీని తెలియజేశారు. ఇకపైన ఎవరు తనని ప్యాకేజి స్టార్ అంటే బాగుండదని తెలియజేశారు.
మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఒకో చిత్రానికి 50 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుంటున్నారనే వార్త ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. ఇక గతంలో వకీల్ సాబ్ సినిమాకి కూడా రూ.50 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నారని టాక్ వినిపించింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కల ప్రకారం తాను చేసిన ఆరు సినిమాలకు రూ 120 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయట . దీంతో పవన్ కళ్యాణ్ ఒక చిత్రానికి రూ.20 కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని చెప్పవచ్చు.