సోషల్ మీడియా పుణ్యమా అని ఏదైనా చిన్న వార్త వస్తే చాలు దాన్ని మీడియా వండి వారుస్తూ ఉంటుంది. ముఖ్యంగా సిని, రాజకీయ ప్రముఖుల గురించి ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఎప్పుడూ ఫోకస్ చేసే సోషల్ మీడియా వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తూ ఏదోక ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ మహేష్ గురించి ఒక ప్రచారం జరుగుతుంది.
మహేష్ బాబుకి ఆగడు సినిమా సమయంలో తగిన గాయం మళ్ళీ తిరగాబెట్టిన నేపధ్యంలో అతనికి ఆపరేషన్ జరిగిందని, న్యూయార్క్ లో ఆపరేషన్ చేసారని ప్రచారం చేస్తున్నారు. దీని మీద పలు వెబ్ సైట్స్ కథనాలు కూడా ప్రసారం చేసాయి. అయితే దీని వెనుక వాస్తవం లేదని, అతను వరుసగా సినిమాలు చేయడంతో రెస్ట్ కోసం న్యూయార్క్ వెళ్ళాడని అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం.
అది అంతా సోషల్ మీడియా, మీడియా సృష్టే గాని అసలు అందులో ఏ విధమైన వాస్తవం లేదని అంటున్నారు. మూడు నెలల వరకు అతను అక్కడే ఉంటాడని తగ్గే వరకు తిరిగి రారని సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరిగింది. మూడు నెలలు మహేష్ విశ్రాంతి కోసం వెళ్ళాడట. కాగా మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.