“దసరా” లో తమన్నా ఐటమ్ సాంగ్..?

-

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘దసరా’మూవీ పైన ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. సింగ‌రేణి బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మహానటి’ కీర్తి సురేశ్ ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.

మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ పిక్చర్ షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరలో ఈ సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ మూవీకి సంతోష్ నారాయ‌ణ‌న్‌, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా తమన్నా ఐటెమ్ సాంగ్ లో నటించనుందట. ఈ మేరకు అన్నీ సంప్రదింపులు కూడా జరిగాయట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news