రూ.3399కే నోకియా 5310 మొబైల్ ఫోన్‌..!

-

హెచ్ఎండీ గ్లోబ‌ల్.. నోకియా 5310 పేరిట ఓ నూత‌న ఫీచ‌ర్ ఫోన్‌ను భార‌త్‌లో మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. ఇందులో ఎంపీ3 ప్లేయ‌ర్‌, మైక్రో ఎస్‌డీ కార్డు వేసుకునే స్లాట్‌, ఎఫ్ఎం రేడియో, ఫ్రంట్ ఫేసింగ్ స్పీక‌ర్లు త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.

Nokia 5310 feature phone launched in India

నోకియా 5310 స్పెసిఫికేష‌న్లు…

* 2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఎంటీ6260ఏ ప్రాసెస‌ర్‌, 8ఎంబీ ర్యామ్‌, 16 ఎంబీ స్టోరేజ్‌
* 32 జీబీ వ‌ర‌కు ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, డ్యుయ‌ల్ సిమ్
* సిరీస్ 30 ప్ల‌స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, వీజీఏ బ్యాక్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
* వైర్‌లెస్ ఎఫ్ఎం రేడియో, డ్యుయ‌ల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీక‌ర్లు
* 2జి, బ్లూటూత్ 3.9, మైక్రో యూఎస్‌బీ
* 1200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 22 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ స్టాండ్ బై

నోకియా 5310 మొబైల్ ఫోన్ వైట్ విత్ రెడ్‌, బ్లాక్ విత్ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో లాంచ్ అయింది. రూ.3,999 ధ‌ర‌కు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో జూన్ 23 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకు గాను ప్రీ బుకింగ్స్‌ను ఇప్ప‌టికే ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news