మహేష్ బాబు కు ఎదురుగా నిలిచి తొడ గొట్టబోతున్న బసిరెడ్డి.!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు. ఇక తాను ఒక హీరో తో సినిమా చేస్తే మళ్లీ వారితోనే సినిమాలు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక మహేశ్ మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు ఇలా వరసగా వారితోనే మార్చి మార్చి తీస్తూ ఉంటారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇందులో మన బసిరెడ్డి మహేష్ బాబు కు ఎదురు నిలిచి తొడ గొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. బసిరెడ్డి అంటే   అరవింద సమేత’లో క్రూర మైన విలన్ గా అదర గొట్టిన మన జగపతిబాబు అండి. ఈ సారి కూడా వీరి మధ్య సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే చుర కత్తుల లాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి తెలుస్తోంది.ఇందులో యంగ్ సంచలన అందం పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news