సైరాలో జగపతి లుక్ ఇదే..!

-

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే చిరు, అమితాబ్, విజయ్ సేతుపతిల ఫస్ట్ లుక్ రివీల్ అవగా లేటెస్ట్ గా జగపతి బాబు లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఈరోజు జగపతి బాబు బర్త్ డే సందర్భంగా సైరాలో జగ్గు భాయ్ లుక్ రిలీజ్ చేశారు. సైరాలో జగపతి బాబు అదరగొట్టడం ఖాయామని ఆ పోస్టర్ చూస్తేనే తెలుస్తుంది. అయితే పాత్ర పేరుని రివీల్ చేయలేదు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, అనుష్కలకు ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది. ఈ ఇయర్ దసరా బరిలో సైరా వస్తుందట. మరి ఈ సైరా సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version