రౌడీ హీరో సరసన శ్రీదేవి కూతురు…..రాయబారం చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్….??

-

టాలీవుడ్ యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఆనంద్ అన్నామలై అనే యువ దర్శకుడి సినిమాతో పాటు, వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. కాగా వీటిలో ముందుగా వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14న లవర్స్  డే కానుకగా రిలీజ్ కాబోతోంది. విజయ్ సరసన ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తుండగా, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా తరువాత విజయ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శత్వంలో ఫైటర్ అనే సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా ఫిలిం గా తెలుగు సహా హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి పెద్ద కూతరు జాన్వీ కపూర్ ని తీసుకోవాలని ప్రస్తుతం దర్శక నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిజానికి ఈ వార్త గతంలో వచ్చినప్పటికీ, అటువంటిది ఏమి లేదని జాన్వీ తండ్రి బోనీ కపూర్ దీనిని ఖండించారు. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తీయాలని ఎప్పుడైతే పూరి అనుకున్నాడో, అప్పుడే ఈ సినిమాలో హీరోయిన్ కి అటువంటి అపీల్ ఉండాలని భావించి జాన్వీ ని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ సినిమాను హిందీలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న కరణ్ జోహార్, స్వతహాగా శ్రీదేవి ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి కావడంతో, జాన్వీ ని తమ సినిమాలో తీసుకునే విషయమై బోనీ కపూర్ తో మాట్లాడే బాధ్యతను ఆయన తీసుకున్నట్లు పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరి ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం, విజయ్ ఫ్యాన్స్ కు ఇది మంచి పండుగ వార్తే అని చెప్పవచ్చు……!!

Read more RELATED
Recommended to you

Latest news