ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన విషయంలో ముఖ్యమంత్రి జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారు. రాజకీయంగా తనకు ఉన్న బలాన్ని వాడుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు జగన్. ఇక మంత్రుల విషయంలో కూడా ఆయన చాలా సీరియస్ గానే ఉన్నారు. ఆదాయం పెంచాలని, సచివాలయానికి రావాలని, పరిపాలన విషయంలో ఎక్కడా లైట్ తీసుకోవద్దని జగన్ వారికి సూచిస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలు తర్వాత… ఆదాయం పెంచితే అభివృద్ధి సాధ్యమని చెప్తున్నారట జగన్… ఈ నేపధ్యంలో నలుగురు మంత్రులు జగన్ చెప్పినా సరే తీరు మార్చుకోవడం లేదనే వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి సచివాలయానికి రాగా… మంత్రుల పని తీరు మీద అధికారులు ఆయనకు ఫిర్యాదు చేసారట. కనీసం అందుబాటులో ఉండటం లేదని ఎక్కడికి వెళ్తున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉందని జగన్ కి వాళ్ళు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
వాళ్ళను పిలిచి జగన్ మాట్లాడారట. ఈ ఆరు నెలల్లో వాళ్ళు కనీసం తమ శాఖల మీద పట్టు కూడా పెంచుకోలేదనే విషయాన్ని జగన్ గమనించినట్టు సమాచారం.. దీనితో వాళ్ళను ఏమీ అనకుండానే సంక్రాంతి తర్వాత పిలుస్తాను అన్నారట. దీనితో ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. వాళ్ళను మంత్రి వర్గం నుంచి జగన్ సాగనంపడం ఖాయమనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. సంక్రాంతి తర్వాత పంపిస్తారని అంటున్నారు. కనీస అవగాహన లేకుండా ఉన్నారని, తాను ఏమో పరిపాలన మీద తలమునకులు అవుతుంటే వాళ్ళ నుంచి కనీస సహకారం కూడా లేదని జగన్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.