ఇండియాలో ఉండే అమెరికన్లకు… వైట్ హౌస్ వార్నింగ్…! వచ్చేయండి…?

-

దేశంలో పౌరసత్వ సవరణ బిల్లు అనేది వివాదాస్పదంగా మారింది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు… ముంబై నుంచి కలకత్తా వరకు… ఢిల్లీ నుంచి గల్లి వరకు దీనిపై ఇప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ బిల్లు రాజకీయ ప్రకంపనాలకు కూడా వేదికగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అసోం లో బిజెపి ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ లో, పశ్చిమ బెంగాల్ లో, ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున విధ్వంశం కూడా జరుగుతుంది…

ఇదిలా ఉంటె ఇతర దేశాలు ఇప్పుడు జాగ్రత్తలు పడుతున్నాయి. భారత్ లో ఉన్న తమ పౌరుల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నాయి… దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్ర రాజధాని ముంబై, బెంగాల్ రాజధాని కలకత్తా, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో ఉండే అమెరికన్లు అత్యవసరం అయితేనే భారత్ లో ఉండాలని అమెరికా హెచ్చరికలు చేసినట్టు తెలుస్తుంది. పరిస్థితులు ఈ బిల్లు విషయంలో తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కాబట్టి వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అమెరికా తన పౌరులకు హెచ్చరికలు జారి చేసింది.

జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆహారానికి కూడా నిలబడవద్దని, భద్రత ఉంటుంది అని మీకు అనిపిస్తేనే హోటల్స్ లో ఉండాలని సూచించింది… పర్యాటక ప్రదేశాలకు దూరంగా ఉండాలని కూడా అమెరికా తన పౌరులకు హెచ్చరికలు జారి చేసినట్టు తెలుస్తుంది. వర్క్ ఫ్రొం హోం కి ప్రాధాన్యత ఇవ్వమని కూడా చెప్పినట్టు సమాచారం. దీనిపై స్పష్టమైన సమాచారం అనేది లేకపోయినా… బ్రిటన్ సహా అనేక దేశాలు తమ పౌరులను వెనక్కి రావాలని పిలిచినట్టు వార్తలు వస్తున్నాయి. అన్ని దేశాలు ఇదే తరహా హెచ్చరికలు చేసాయి.

Read more RELATED
Recommended to you

Latest news