Japan Trailer : జపాన్ ట్రైలర్ వచ్చేసింది..క్రేజీ దొంగగా అదరగొట్టిన కార్తీ

-

Japan Trailer : కంటెంట్ ఉన్న స్టోరీలతో తన ఫ్యాన్స్ ని ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుంటాడు కార్తీ. ఇటీవలే పొన్నియున్ సెల్వన్’, ‘సర్దార్’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాడు. పీఎస్ మిత్ర‌న్ దర్శకత్వంలో వచ్చిన కార్తీ.. స‌ర్దార్ మూవీ స్పై థ్రిల్ల‌ర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ ప్రాజెక్ట్‌ తో వచ్చాడు. జపాన్‌ అనే సినిమాను కార్తీ చేస్తున్నాడు.

Japan (Tamil) – Official Trailer

కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జపాన్’. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ అలరించగా….ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా…. సునీల్ ప్రధాన పాత్ర పోషించారు. కార్తీ లుక్ ఆసక్తికరంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news