హీరో కూతురు ఖాతాలోకి ‘మా’ అసోషియేషన్ డబ్బు.. ‘మా’లో మళ్లీ మొదలైన గొడవలు..!

64

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రస్తుతం నరేష్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్యానెల్ లో జీవిత, రాజశేఖర్ ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు. శివాజి రాజాతో టఫ్ ఫైట్ మీద నరేష్ ప్యానెల్ గెలవడం జరిగింది. ఇదిలాఉంటే ఎక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్న వారికి మా అసోషియేషన్ 7 లక్షల డబ్బు హీరో రాజశేఖర్ కూతురు ఎకౌంట్ లో ట్రాన్స్ ఫర్ అవడం హాట్ న్యూస్ గా మారింది.

దీనిపై జీవిత వర్షన్ ఎలా ఉంది అంటే మా సభ్యులకు ప్రభుత్వం నుండి పొందాల్సిన సదుపాయాలు అందించేందుకు వారి ప్రచారానికి ఆ డబ్బుని వాడామని ముందు తాము ఖర్చు పెట్టడం జరిగిందని ఆ తర్వాత మా నుండి తమ ఎకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయడం జరిగిందని జీవిత అన్నారు. అది ప్యానెల్ సభ్యుల అందరి అభిప్రాయంతోనే అలా చేశామని చెప్పారు జీవిత. మరి ఈ విషయంపై నరేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.