‘ జోడీ ‘ హిట్టా… ఫ‌ట్టా… ఆదికి కెరీర్ ఏమైన‌ట్టు…!

231

సాయికుమార్ త‌న‌యుడు ఆది సాయికుమార్‌, జెర్సీ ఫేం శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా తెర‌కెక్కిన సినిమా జోడీ. విశ్వ‌నాథ్ అరిగెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జెర్సీ టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సాహో వ‌చ్చిన వారం రోజుల‌కే డేరింగ్‌తో ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు ఎలాంటి టాక్ ఉందో చూద్దాం.

Jodi Movie Review Analysis
Jodi Movie Review Analysis

ఈ సినిమా క‌థ చూస్తే క‌పిల్(ఆది) యంగ్ సాఫ్ట్వేర్. మొదటి చూపులోనే కాంచన మాల( శ్రద్దా శ్రీనాధ్) ప్రేమలో పడటం, ఆమె ప్రేమను దక్కించుకోవడం జరుగుతుంది. వీరి పెళ్లి ఫిక్స్ అయ్యాక కాంచ‌న మాల తండ్రి క‌పిల్ తండ్రిని చూసి పెళ్లి వ‌ద్దంటాడు ? ఈ పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది. చివ‌ర‌కు క‌థ ఏమైంది అన్న‌దే జోడీ స్టోరీ.

ఆది గ‌త చిత్రాల‌తో పోలిస్తే న‌ట‌న‌లో కాస్త బెట‌ర్ అయ్యాడు. హీరోయిన్ శ్ర‌ద్ధ రొమాంటిక్‌గా క‌నిపించింది. ఇక డైరెక్ష‌న్ విష‌యానికి వస్తే కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నాలు సినిమాను బోర్ కొట్టించేశాయి. ఫ‌స్టాఫ్‌లో కాస్త రొమాన్స్‌, ఎమోష‌న్స్ ఉన్నా సెకండాఫ్‌లో ఎందుకు వ‌చ్చారాం బాబు అన్న‌ట్టుగా తీశాడు. ఒకే సీన్ ప‌దే ప‌దే తిప్పి చూపించాడు. క్లైమాక్స్ ఎన్నో తెలుగు సినిమాల్లో చూసేశాం.

ఓవ‌రాల్‌గా చూస్తే జోడి చిత్రం ఏమాత్రం ఆకట్టుకొని ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామా. ఆది కి మరో ఫెయిల్యూర్ ..ఆది నెక్ట్స్ టైం బెట‌ర్ ల‌క్ అనాల్సిందే.