బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన సుజాత.. ట్రెండింగ్ లో వీడియో..

తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వందరోజుల పాటు అంతులేని వినోదాన్ని అందించిన బిగ్ బాస్ షో, ఇప్పటి వరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగవ సీజన్లో అభిజిత్ గెలుపొందగా, రన్నరప్ గా అఖిల్ నిలిచాడు. మూడవ స్థానంలో నిలిచిన సోహైల్ అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఐతే ప్రస్తుతం షో పూర్తయ్యి చాలా రోజులు అవుతుంది. బిగ్ బాస్ హౌస్ ని అన్నపూర్ణ స్టూడియోలో డిజైన్ చేసారని అందరికీ తెలుసు.

షో నడిచినన్ని రోజులు ఎంతో అందంగా కనిపించిన ఆ హౌస్, ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవాలనుందా? ఆ ప్రయత్నమే చేసింది బిగ్ బాస్ సుజాత. నాలుగవ సీజన్లో కంటెస్టెంట్ గా వచ్చి, అందరి దృష్టిని ఆకర్షించిన జోర్దార్ సుజాత, బిగ్ బాస్ ని మరో మారు దర్శించుకుంది. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి హౌస్ ఇప్పుడెలా ఉందో అందరికీ చూపించింది. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది.

హౌస్ లోకి తమని ఏ విధంగా తీసుకువెళ్తారు. హౌస్ గేటు ముందు ఎంత సేపు నిలబెడతారు? అవతలి నుండి ఎలాంటి సౌండ్, హౌస్ లోకి చేరకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారుఉ సహా అన్ని విషయాలని బయటపెట్టింది. అద్దంలా కనిపించే వాటి వెనక కెమెరాలు ఎందుకుంటాయి? హౌస్ లో ఎక్కువగా ఆకర్షించిన స్విమ్మింగ్ ఫూల్ పరిస్థితి ఇప్పుడెలా ఉంది. హౌస్ ముందు పెద్ద పెద్ద హోర్డింగుల్లో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి లాంటి మనకు తెలియని ఎన్నో విషయాలని సుజాత బయటపెట్టింది. అంతా అలంకరించినపుడు హౌస్ ఎలా ఉందో చూసారు. అంతా అయిపోయాక ఎలా ఉందో కూడా చూడండి.