సుజాత బిగ్ బాస్ రి ఎంట్రీ ఖాయమా..?

-

మోస్ట్ వాచ్డ్ టెలీవిజిన్ రియాలిటీ షో ఏదయినా ఉందా అంటే తడుముకోకుండా చెప్పే పేరు బిగ్‌ బాస్‌. అన్ని బాషలలో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ షో తెలుగులో సీజన్ 4కి చేరింది. అయితే నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షోలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎక్కువగా ఓట్లు వేస్తున్న కంటెస్టెంట్లను కాద‌ని త‌మ‌కు అవసరం లేదనుకున్న వారిని ఎలిమినేట్ చేస్తున్నాడ‌ని చాలామంది ప్రేక్షకులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

అలా ఫేక్ ఎలిమినేషన్ తోనే జోర్దార్ సుజాత, దేవి నాగ‌వ‌ల్లి, స్వాతి దీక్షిత్‌, కుమార్ సాయిని పంపిచేశార‌ని సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. జోర్దార్ సుజాత బయటకు వచ్చిన సమయంలో సోషల్ మీడియాలో ఆమె ఎలిమినేషన్ నిజం కాదని నిర్వాహకుల్ని ట్రోల్ చేశారు ఈ క్రమంలోనే ఆమెను మళ్ళీ లోపలకి పంపుతున్నారట. విశ్వనీయ సమాచారం మేరకు జోర్దార్ సుజాతతో నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని, బయటకి వెళ్లావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడైనా మళ్ళీ హౌస్ లోకి వెళ్లేందుకు రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చారట. ఆమె ఈ ఆదివారం కానీ వచ్చే ఆదివారం కానీ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఈ వారానికి ఎలిమినేషన్ కూడా స్కిప్ చేసే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున షూట్ కోసం మనాలీ వెళ్ళాడు. కాబట్టి వేరే హోస్ట్ చేత షో చేయించనున్నారు. అది సమంతానే అనే ప్రచారం అయితే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news