జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ అన్నకు కలిసి వస్తుందా…?

-

ఇప్పటికే సంక్రాంతికి తెలుగులో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. రజని కాంత్ నటించిన దర్బార్, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. సంక్రాంతి సీజన్ కావడంతో సినిమా ఎలా ఉన్నా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్ కి వెళ్ళడంతో సినిమా టాక్ అనేది సంబంధం లేకుండా పోయింది.

ఇక మరో సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది. ఈ సినిమాను సతీష్ వేగేశ్న తెరకెక్కి౦చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదల అయిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలు కావడంతో కళ్యాణ్ రామ్ ఏ విధంగా నిలబడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఇటీవల ఈ సినిమా కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. దీనితో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తమ్ముడి ఫాన్స్ అందరూ కూడా అన్న సినిమాను చూసే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. అదే గనుక జరిగితే, ఈ సినిమాకు కూడా హిట్ టాక్ వస్తే సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు ఏ మాత్రం యావరేజ్ టాక్ ఉన్నా సరే ఇబ్బంది పడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news