కాజల్ అగర్వాల్ ఎమోషనల్ ట్వీట్..

-

నటి కాజల్ అగర్వాల్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఆమె తల్లి కాబోతున్న విషయం తెలిసిందే.కాగా ఆమె సోషల్ మీడియాలో తన భర్త గౌతమ్ ని ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ నోట్ ని పోస్ట్ చేసింది.ప్రతి మహిళా జీవితంలో గొప్పగా చెప్పుకునే ఈ మధుర క్షణాల్లో తన భర్త తనని అన్ని విధాలుగా సంరక్షిస్తూన్నట్టు ఆమె చెప్పింది.త్వరలో తమ జీవితాల్లో గొప్ప మార్పులు రానున్నాయని, ఇకపై పార్టీలు, సినిమాలు, షికార్లు ఉండవని కాజల్ పేర్కొంది.పుట్టబోయే బిడ్డతో ప్రతిక్షణం మరింత ఆనందంగా గడపాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

” డియర్ గౌతమ్..ఓ మంచి భర్తగా నాకు ఎప్పుడూ తోడుగా ఉన్నందుకు, ప్రతి ఆడపిల్ల కోరుకునే తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు.నన్ను ఎల్లప్పుడూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు.ప్రతీక్షణం సంతోషంగా ఉండేలా చేశావు.త్వరలో మన ముద్దుల బేబీ ఈ లోకం లోకి రానుంది.ఆలోపు నువ్వు ఎంత అద్భుతమైన వ్యక్తివో నీకు తెలియ జేయాలి అనుకుంటున్నాను.గడిచిన ఎనిమిది నెలల్లో నీలో నేను ఒక గొప్ప తండ్రిని చూసాను.పుట్టబోయే మన బిడ్డను నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో , తన సంరక్షణ కోసం ఎంతలా శ్రమిస్తున్నావో నాకు తెలుసు, త్వరలో మన జీవితాల్లో ఎంతో మార్పు రానుంది.

ఇప్పటిలా మనకోసం మనం సమయాన్ని కేటాయించుకోలేమ్, వీకెండ్ లో సినిమాలు, షికార్లకు వెళ్ళలేమ్, టీవీ షోలు చూసుకుంటూ ఆలస్యంగా నిద్ర పోలేమ్, అతి ముఖ్యంగా పార్టీలు, డేట్ నైట్స్ కు దూరమౌతామ్, వీటన్నింటికీ మనం దూరమైనప్పటికీ మన బేబితో విలువైన సమయాన్ని గడుపుతామ్, నీపై నా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్ యూ అని కాజల్ పోస్ట్ చేసింది.

 

https://www.instagram.com/p/CcUTEwmBQQF/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news