కాజ‌ల్ వెడ్డిండ్ రిసెప్ష‌న్ రెండు చోట్లా?

కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న చిర‌కాల మిత్రుడు, ఫ్యామిలీ ఫ్రెండ్‌.. సోల్‌మేట్ గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. అక్టోబ‌ర్ 30న వీరి వివాహం ఇరు కుటుంబాల అంగీకారంతో ముంబైలోని హోట‌ల్ తాజ్‌లో వైభ‌వంగా జ‌రిగింది. కోవిడ్ కారణంగా కాజ‌ల్ పెళ్లికి సౌత్ ఇండియా నుంచి ఏ ఫిల్మ్ స్టార్ హాజ‌రు కాలేదు. ఇరు కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహిత‌లు మాత్ర‌మే ఈ వివాహంలో పాల్గొన్నారు.

ప్ర‌స్తుతం కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లూ తో క‌లిసి మాల్దీవుల్లో హ‌నీమూన్ ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంటోంది. ప్ర‌స్తుతం కాజ‌ల్ హ‌నీమూన్ ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ నేప‌థ్యంలో హ‌నీమూన్ ముగించుకుని తిరిగి వ‌చ్చాక కాజ‌ల్ రిసెప్ష‌న్‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

అయితే అది కేవ‌లం ఒక చోట మాత్ర‌మే కాకుండా రెండు చోట్ల రిసెప్ష‌న్‌ని కాజ‌ల్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ద‌క్షిణాది ఇండ‌స్ట్రీతో కాజ‌ల్‌కు ప్ర‌త్యేక అనుబంధం వుంది. తెలుగు చిత్రాల‌తో పాపుల‌ర్ అయిన కాజ‌ల్ త‌మిళంలోనూ రాణించింది. అందుకే హైద‌రాబాద్‌, చెన్నైల‌లో రెండు చోట్ల రిసెప్ష‌న్‌ని నిర్వ‌హించాల‌ని కాజ‌ల్ భావిస్తున్న‌ట్టు తెలిసింది. స‌హ న‌టీన‌టుల‌కు, హీరోలకు ప్ర‌త్యేకంగా పార్టీ ఇవ్వ‌బోతోంద‌ని తెలిసింది.