కాజల్ అగర్వాల్.. అప్పుడెప్పుడో 12 ఏళ్ల క్రితం లక్ష్మి కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ బ్యూటి.. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇక అప్పటినుండి వరుసగా సినిమాలు చేస్తూ.. దాదాపు ఓ దశాబ్దం కాలంగా టాలీవుడ్‌ను ఏలేస్తుంది. స్టార్ హీరోయిన్‌గా కూడా గుర్తింపు పొందిన కాజల్ ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే అటూ తమిళ్, హిందీ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది.
ప్రస్తుతం ఈ బ్యూటి కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆచార్య చిత్రంలో ఛాన్స్ పట్టేసింది. అయితే ప్రస్తుతం ప్రపంచం కరోనా గుప్పిట్లో బందీగా మారిపోయింది. కంటికి కనిపించని సూక్ష్మజీవితో యుద్ధం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని 21 రోజుల పాటు ప్రకటించారు.
ఈ క్రమంలోనే షూటింగ్స్ కూడా లేకపోవడంతో కాజల్ ఇంటికే పరిమితం అయింది. ఇంట్లోనే ఉంటున్న కాజల్.. పిండి వంటలు చేస్తోంది. దానికి సంబందించిన ఓ ఫోటోను షేర్ చేసిన కాజల్.. మొదటి సారి చేశానని.. అది పంజాబీ స్టైల్ సమోసాను చేశానని గర్వంగా చెప్పుకుంది. అంతేకాదు ఆ సమోసాలను పట్టుకుని ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, కొందరు షాక్ అవుతుంటే.. మరికొందరు సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.