జనరేషన్లు మారుతున్నట్టుగానే… సినిమాలు కూడా మూస ధోరణిని వదిలేశాయి. కొత్త కొత్త కథాంశాలతో ప్రేక్షకుల ముందు వస్తున్నాయి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బాగా గిరాకీ ఉంది మార్కెట్ లో. ఆ ఉడ్.. ఈ ఉడ్ అని లేకుండా.. అన్ని ఉడ్ లలో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి. సక్సెస్ కూడా అవుతున్నాయి. అందుకే… ఆ సినిమాలకు గిరాకీ బాగా పెరిగింది.
తాజాగా తెలుగులో కాజల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా వస్తోంది. ఆ సినిమా పేరు సీత. తేజ డైరెక్టర్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆమె సరసన నటిస్తున్నాడు. సోనూసూద్ విలన్. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. ఈనెల 24న సినిమా రిలీజ్ కానుంది.
ఇదివరకే రిలీజ్ చేసిన సీత టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టించింది. తాజాగా.. సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. నా పేరు సీత.. నేను గీసిందే గీత.. అంటూ కాజల్ ఎంట్రీ ఇవ్వడం.. అమాయకుడి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించడం.. ఎక్కువ అడవి చుట్టూ కథ తిరుగుతుండటం చూస్తుంటే.. సినిమాలో విషయం బాగానే ఉన్నట్టుంది అనేట్టుగా ఉంది ట్రైలర్. తేజ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కావడం.. అది కూడా కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో.. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. చూద్దాం.. సినిమా ఎంతమేరకు ఆకట్టుకుందో.. ముందైతే ట్రైలర్ చూసేయండి.