పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకుని పాకిస్థాన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న రీతిలో రాఖీ సావంత్ పోజులు పెట్టింది. కానీ క్యాప్షన్‌లో మాత్రం తనకు ఇండియా అంటే ఎంతో ఇష్టమని, కానీ ప్రస్తుత సినిమాలో పాకిస్థాన్ యువతిగా నటిస్తున్నాననంటూ రాసింది.
పరదేశియా.. అనే సాంగ్‌తో బాలీవుడ్ ఐటం బాంబ్‌గా పేరు తెచ్చుకుంది రాఖీ సావంత్. ఎప్పటికప్పుడు ఆమె చేసే వ్యాఖ్యలు, పనులు వివాదాస్పదమవుతూనే ఉంటాయి. వివాదాలు ఆమెకు కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఆమె చేసిన పనుల వల్ల వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. అయితే గత కొంత కాలంగా ఈమె వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటోంది. కానీ ఇప్పుడు తాజాగా ఈమె చేసిన ఓ పని వల్ల మరోసారి ఈమె వివాదాల్లో చిక్కుకుంది. దీంతోపాటు సోషల్ మీడియాలోనూ భారతీయులు ఈమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
రాఖీ సావంత్ ధారా 370 అనే సినిమాలో పాకిస్థానీ యువతిగా నటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో రాఖీ సావంత్ పాల్గొంటోంది. అయితే ఓ పాట చిత్రీకరణలో భాగంగా కాసేపు ఆమెకు విరామం దొరికింది. దీంతో షూటింగ్ లొకేషన్ లో పాకిస్థాన్ జెండాను ఛాతిపై కప్పుకుని పాకిస్థాన్ అంటే తనకు ఎంతో ఇష్టమన్న రీతిలో రాఖీ సావంత్ పోజులు పెట్టింది. కానీ క్యాప్షన్‌లో మాత్రం తనకు ఇండియా అంటే ఎంతో ఇష్టమని, కానీ ప్రస్తుత సినిమాలో పాకిస్థాన్ యువతిగా నటిస్తున్నాననంటూ రాసింది. అనంతరం ఆ ఫొటో, క్యాప్షన్‌లను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది.
అలా రాఖీ సావంత్ చేసిన పోస్టుకు భారతీయులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. భారతీయురాలివై ఉండి పాకిస్థాన్‌కు సపోర్ట్ చేయడమేంటని ఆమెపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను విమర్శిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి రాఖీ సావంత్ తన పోస్టు, నెటిజన్ల కామెంట్ల పట్ల ఎలా స్పందిస్తుందో వేచి చూస్తే తెలుస్తుంది..!