చిరంజీవి అల్లుడు హీరోగా ‘సూపర్ మచ్చి`.. ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

-

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ఆ మధ్య ‘విజేత’ సినిమా ద్వారా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయన రెండవ సినిమాకి పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి తాజాగా ‘సూపర్ మచ్చి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ని వదిలారు.

జోరు వర్షంలో ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్న కళ్యాన్ లుక్‌ సూపర్బ్‌గా ఉంది. టైటిల్ ను బట్టి.. లుక్‌ను బట్టి మాస్ అంశాలు ఎక్కువగా కలిగిన మూవీ అనే విషయం అర్థమవుతోంది. తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా ‘రియా చక్రవర్తి’ కనిపించనుంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news