మళ్లీ ఎమోషనల్ అవుతున్న కళ్యాణ్ దేవ్.. శ్రీజతో విడిపోయినట్టేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చిరంజీవి అల్లుడుగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ మొదటి సినిమా విజేతతో పర్వాలేదు అనిపించుకున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజను వివాహం చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ కి ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబం నుంచి అండ రావడంతో బాగానే పేరు సంపాదించారు. అయితే గడచిన కొద్దిరోజుల క్రితం నుంచి కళ్యాణ్ దేవ్ శ్రీజ విడిపోతున్నారు అనే వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ వార్తలపై ఇప్పటివరకు అటు మెగా కుటుంబం కాని కళ్యాణ్ దేవ్ కానీ క్లారిటీ ఇవ్వలేదు.

కానీ అప్పుడప్పుడు మాత్రం కళ్యాణ్ దేవ్ లో ఎమోషనల్ పోస్టులు మాత్రం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు. కళ్యాణ్ దేవ్ నటించిన సూపర్ మచ్చి, కిన్నెరసాని వంటి చిత్రాలకు మెగా కుటుంబం సపోర్ట్ లేకపోవడంతో ఈ చిత్రాలు చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అసలు విషయంలోకి వెళ్తే శ్రీజ కళ్యాణ్ దేవ్ ఉన్న తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేర్లు మార్చడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు చాలా వైరల్ గా మారాయి.

శ్రీజ తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ కి ఉన్న పేరులో కళ్యాణ్ తొలగించి కొణిదెలా అని పెట్టుకున్నప్పుడు వీరి విడాకుల రూమర్లు నిజమేనని అందరూ ఫిక్స్ అయిపోయారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ కు మెగా కుటుంబం సపోర్టు కూడా లేకపోవడంతో కళ్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీజ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎవరి దారిన వారే అన్నట్టుగా ఉంటున్నారు. ప్రేక్షకులకు తెలిసిపోయింది కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగానే ఉంటున్నారు ఎక్కువగా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్కు వెళ్లడం బాగా ఎంజాయ్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు . తాజాగా కళ్యాణ్ దేవ్ ఒక పోస్ట్ షేర్ చేయగా అందులో ఓ పిక్ అన్నిటికి సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇది ఏ ఉద్దేశంతో పెట్టారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)

Read more RELATED
Recommended to you

Latest news