తమ్ముడితో సినిమా చేస్తా, కళ్యాణ్ రామ్ కీలక వ్యాఖ్యలు…!

-

గత కొన్నాళ్ళుగా నందమూరి వారసులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముందు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు ఇద్దరు కూడా సినిమా రంగంతో పాటు కుటుంబం పరంగా కూడా సన్నిహితంగా ఉంటున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవు రా సినిమా కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరై మెచ్చుకున్నాడు.

దీనితో కళ్యాణ్ రామ్ సినిమాకు హైప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఛానల్ ఈటీవీలో అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసాడు. తారక్‌ను నాన్నా అని పిలుస్తానని, తమ్ముడు అని ఎప్పుడూ పిలవనని చెప్పుకొచ్చాడు. తారక్ తనతో కొన్ని సార్లు తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఉంటాడని,

కొన్ని సార్లు చిన్న పిల్లాడిగా మారిపోతాడని వివరించాడు కళ్యాణ్ రామ్. నాన్నంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన కళ్యాణ్ రామ్, ఆయన లేని లోటును తారక్ తీర్చుతున్నాడని పేర్కొన్నాడు. ఒకరికి ఒకరం అండగా ఉంటామని కల్యాణ్‌రామ్ ఈ కార్యక్రమంలో వివరించాడు. నాన్నకు తారక్, తాను కలిసి ఒక సినిమా చేయాలని ఉండేదని.. భవిష్యత్తులో తారక్‌తో మరిన్నిసినిమాలు తీస్తానని వ్యాఖ్యానించాడు కళ్యాణ్ రామ్.

Read more RELATED
Recommended to you

Latest news